బెల్లంపల్లి: గుండెపోటుకు గురై తండ్రి అకాల మృతిచెందగా, ఆ కుటుంబం పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని ఆయన రెండు కళ్లను దానం చేసి మానవత్వాన్ని చాటుకుంది. ఆ రెండుకళ్లతో మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించడానికి దోహదపడ్డారు. బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఏరియాకు చెందిన కొట్టే సత్యప్రకాశ్ (68) ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. భార్య నాగమణి, కుమారుడు నవీన్, కుటుంబ సభ్యులు ఆయన కళ్లను దానం చేయడానికి ముందుకు వచ్చారు. జనహిత సేవా సమితిలో సభ్యుడైన నవీన్.. సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్.లింగమూర్తి సౌజన్యంతో మృతుడు రెండు కళ్లను ఎల్‌వీ ప్రసాద్, ఐ బ్యాంక్ సిబ్బంది ప్రదీప్ వచ్చి సేకరించి సర్టిఫికేట్ అందజేశారు. జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడేపు సతీశ్, సహాయ కార్యదర్శి పెద్ది వినయ్‌కుమార్, సభ్యుడు సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.


