రాష్ట్రస్థాయి వుషూ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి వుషూ పోటీలు ప్రారంభం

Mar 16 2026 7:53 AM | Updated on Mar 16 2026 7:53 AM

భైంసాటౌన్‌: పట్టణంలోని మున్నూరుకాపు సంఘ భవనంలో ఆదివారం అస్మిత ఖేలో ఇండియా మహిళల వుషూ రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ దత్తాత్రి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో మానసిక, శారీరక ధృడత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం అలవడుతుందన్నారు. మహిళలు సైతం క్రీడల్లో ముందుండాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు భైంసా వేదిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ అమేచ్యూర్‌ వుషూ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్‌రాజ్‌, రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్‌ ఒమర్‌, జిల్లా అధ్యక్షులు లోలం రాజశ్రీ, కార్యదర్శి జ్ఞానతేజ, కోచ్‌ శ్రీరాముల సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement