స్పెషల్‌ రైళ్లు రెగ్యులర్‌ అయ్యేదెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ రైళ్లు రెగ్యులర్‌ అయ్యేదెప్పుడో?

Mar 16 2026 7:53 AM | Updated on Mar 16 2026 7:53 AM

● కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి– నిజామాబాద్‌ మార్గాల్లో రాకపోకలు ● కాలయాపన చేస్తున్న రైల్వేశాఖ ● నాంపల్లి (హైదరాబాద్‌)–గోరక్‌పూర్‌– నాంపల్లి (హైదరాబాద్‌) వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ● తిరుపతి–రక్సల్‌–తిరుపతి (వయా కడప, గుంతకల్లు, రాయ్‌చూరు, వికారాబాద్‌, సికింద్రాబాద్‌, కాజీపేట) వీక్లీ స్పెషల్‌ ● చర్లపల్లి–దానాపూర్‌ (వయా బిలాస్‌పూర్‌, రాయ్‌పూర్‌, రాంచీ, బొకారో, నలంద) బై వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ● చర్లపల్లి–దానాపూర్‌–చర్లపల్లి (వయా నాగపూర్‌, ఇటార్సీ, జబల్‌పూర్‌, ప్రయాగరాజ్‌, పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ) ● కాజీపేట–దాదర్‌ ముంబయి (వయా బల్లార్షా, ఆదిలాబాద్‌, నాందేడ్‌) వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌. ఈ రైలు గతేడాది అర్థంతరంగా రద్దు చేశారు. నే టికీ పున:రుద్దరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ● చర్లపల్లి–సుబేదార్‌గంజ (ప్రయాగరాజ్‌) వీక్లీ స్పెషల్‌ రైలు గత నాలుగేళ్ల నుంచి స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడిపిస్తున్నారు. ఇది రెండు నెలలు నడుస్తూ మరో రెండు నెలలు రద్దు చేస్తుండటం గమనార్హం.

బెల్లంపల్లి: రైల్వేశాఖ వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టిన స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఏళ్లుగడుస్తున్నా రెగ్యులర్‌కు నోచుకోవడం లేదు. కాజీపేట– బల్లార్షా, పెద్దపల్లి–నిజామాబాద్‌ రైల్వేమార్గాల్లో పలు స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. ఆ మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తున్నా రైళ్లను రెగ్యులర్‌ చేయడంలో రైల్వేశాఖ తీవ్ర కాలయాపన చేస్తోంది. ఈప్రాంతం నుంచి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు, ఎంపీలు పట్టింపులేని ధోరణిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ద.మ రైల్వే జోన్‌పరిధిలో ఏళ్ల నుంచి ప్రత్యేకంగా నడుస్తున్న వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఇటీవల రెగ్యులర్‌ వీక్లీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నాంపల్లి (హైదరాబాద్‌) నుంచి కన్యాకుమారి వయా నల్లగొండ, కాచిగూడ నుంచి తూతుకుడి వయా మహబూబ్‌నగర్‌, చర్లపల్లి, నుంచి షాలిమార్‌ వయా కాజీపేట వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును అమృత్‌ భారత్‌గా మార్చి వచ్చే ఏప్రిల్‌ మొదటివారం నుంచి నడపనున్నారు. కానీ కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి–నిజామాబాద్‌ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మాత్రం మోక్షం లభించడం లేదు.

కాజీపేట మార్గంలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లు ఇవే..

వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌

బల్లార్షా మార్గంలో ప్రతీసారి నిరాశే

రైళ్లకు సంబంధించిన ప్రతీ అంశంలోనూ కాజీపేట–బల్లార్షా మార్గంలో ప్రతిసారి రైల్వే శాఖ తీవ్ర వివక్షత చూపుతోందనే విమర్శలు ఉన్నాయి. సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టకపోవడం, ముఖ్యమైన స్టేషన్లలో పలు రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం కల్పించకపోవడం, వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రెగ్యులర్‌ చేయకపోవడం తదితర విషయాల్లో అన్యాయం చేస్తోందనే ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతోంది. తూర్పు కోస్తా రైల్వేజోన్‌ పరిధిలో ఇటీవల పలు వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రెగ్యులర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే శాఖ ద.మ రైల్వే జోన్‌ పరిధిలో ఉన్న కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి నిజామాబాద్‌ మార్గాలను మరోమారు విస్మరించడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికై నా ఆయా మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రెగ్యులర్‌ చేయడానికి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement