ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

Mar 16 2026 7:53 AM | Updated on Mar 16 2026 7:53 AM

ఒంటిపూట బడి వేళ చిన్నారులపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బడికి వెళ్లేటప్పుడు వాటర్‌ బాటిల్‌ ఇవ్వాలి. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాక ఎండలో ఆడకుండా చూడాలి. నీటి పరిమాణం ఉన్న పండ్లు అందించాలి. వడదెబ్బ లక్షణాలు జ్వరం, అలసట, వాంతులు ఉంటే వైద్యులను

సంప్రదించాలి. – డాక్టర్‌ రవి బాశెట్టి,

ఎండీ జనరల్‌ మెడిసిన్‌, నిర్మల్‌

అప్రమత్తంగా ఉండాలి

ఎండలు తీవ్రంగా ఉన్నాయి. సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఎండ ప్రతాపం తెలియని చిన్నారులు ఆటల్లో మునిగి తేలేందుకు ఉత్సాహం చూపుతారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూడాలి. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను రివైజ్‌ చేసుకోవడం.. హోంవర్క్‌ చేసేలా చూడాలి. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచడం

మంచిది. – యాదయ్య, డీఈవో, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement