ఆదిలాబాద్: సోడా వ్యాపారిపై దాడి చేసి నగదు దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. టూ టౌన్‌లో ఆదివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఈనెల 11న మధ్యాహ్నం పట్టణంలోని తిరుపెల్లి కాలనీలో కనకదుర్గ వైన్స్ సమీపంలో సోడా బండి నడుపుతున్న చిత్తల్‌వార్ దీపక్ వద్దకు మహాలక్ష్మి వాడకు చెందిన దండేవర్ అనికేష్, పిలివర్ రాజేష్ వచ్చి సోడా తాగారు. డబ్బులు అడగగా, మా ఏరియాలోకి వచ్చి వ్యాపారం చేస్తూ మమ్మల్నే డబ్బులు అడుగుతావా అని బెదిరించారు. బాధితుడిపై దాడి చేసి గల్లా పెట్టెలోని రూ.1200 నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు పీర్ సింగ్, విష్ణు ప్రకాశ్, సిబ్బంది దత్తు, క్రాంతి పాల్గొన్నారు.


