ఎస్సార్పీలో డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

ఎస్సార్పీలో డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ పర్యటన

Mar 12 2026 7:18 AM | Updated on Mar 12 2026 7:18 AM

నస్పూర్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నాలుగు కొత్త లేబర్‌ కోడ్లపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు బుధవారం సెంట్రల్‌ డిప్యూటి చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ భిస్వ భూషన్‌ సృష్టి శ్రీరాంపూర్‌ ఏరియాలో పర్యటించారు. కార్మికులకు అందుతున్న వైద్య సేవలను, పీఎఫ్‌ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల వివరాల నమోదు, సంక్షేమ కార్యక్రమాల నిర్వాహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఏరియా జీఎం శ్రీనివాస్‌ పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు ఓంకార్‌బాబు, డీజీఎం అనిల్‌కుమార్‌, ఐకే–1ఏ ఓసీ గ్రూప్‌ ఏజెంట్‌ ఏవీ రెడ్డి ఏజీఎం ఫైనాన్స్‌ సు మలత, డీజీఎం అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారంలో విఫలం

నస్పూర్‌: సమస్యల పరిష్కారంలో యాజమాన్యం విఫలమైందని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య అన్నారు. నస్పూర్‌–శ్రీరాంపూర్‌ ప్రెస్‌ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. అనారోగ్యంతో బాధపడుతూ 10 నెలలుగా బో ర్డుకు దరఖాస్తు చేసుకున్న వారిని పిలవకుండా విఽ దులకు గైర్హాజరవుతున్నారని చర్యలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. స్ట్రక్చర్‌ సమావేశాల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు పరిష్కరించక పోవడం సరికదాన్నారు. ఈ నెల 17న అన్ని గనులపై నల్లబ్యాడ్జీలతో నిరసన, 18 నుంచి అన్ని ఏరియాల్లో జాత, 30న కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం వద్ద ధర్న నిర్వహించనున్నట్లు తెలి పారు. సమావేశంలో బ్రాంచి కార్యదర్శి కొముర య్య, ఉపాధ్యక్షుడు కిషన్‌రావు, పిట్‌ కార్యదర్శి న ర్సింగరావు, కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం బెల్లంపెల్లి రీ జియన్‌ కార్యాదర్శి అప్రోజ్‌ఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement