సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్రం | - | Sakshi
Sakshi News home page

సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్రం

Mar 9 2026 7:39 AM | Updated on Mar 9 2026 7:39 AM

తాండూర్‌: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధర రూ.60 పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దాగం రాజా రాం ఆరోపించారు. వంట గ్యాస్‌ ధర పెంపుపై ఆదివారం మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ వ్యవస్థలకు దారాదత్తం చేస్తోందన్నారు. ఇప్పటికే ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది అదనపు భారమన్నారు. నిత్యావసరాల ధరలను అదుపులోకి తీసుకొచ్చి పెంచిన వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం నానయ్య, వేల్పుల శంకర్‌, లక్ష్మి, సుమ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement