అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

Mar 9 2026 7:39 AM | Updated on Mar 9 2026 7:39 AM

నస్పూర్‌: వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉంటుందని, మున్సిపల్‌, అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్‌ దర్ని మధూకర్‌ అన్నారు. ఆదివారం ఎండవేడికి సీసీసీలోని డంప్‌యార్డులోని చెత్తకు మంటలు అంటుకోవడంతో పొగతో కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మేయర్‌ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ పుట్ట యశోద, కాంగ్రెస్‌ నాయకులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement