మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ముగి శాయి. చివరిరోజు 6,319 మంది విద్యార్థులకు గాను 6,065 మంది హాజరు కాగా, 254 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 5,665 మందికిగాను 5,472 మంది హాజరు కాగా, 193 మంది పరీక్షలు రాయలేదు. వొకేషనల్‌లో 654 మందికి గాను 593 మంది హా జరుకాగా 61 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు. కాగా, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు పూర్తి కావడంతో వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు ఇంటిబాట పట్టారు. చివరి పరీక్ష రాసి బయటకు వచ్చిన వారంతా కేరింతలు పెట్టారు. సెల్ఫీలు దిగి సందడి చేశారు. అనంతరం హాస్టల్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామాలకు తరలివెళ్లారు.


