మంచిర్యాలక్రైం: పోలీస్‌శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహించి అనారోగ్యంతో మృతి చెందినవారి కుటుంబాలకు అండగా ఉంటామని రామగుండం పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ (అడ్మిన్) శ్రీని వాస్ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో వివిధ స్టే షన్లలో హోంగార్డుగా విధులు నిర్వహించిన రాములు, తిరుపతి అనారోగ్యంతో మృతి చెందగా తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ సంక్షేమ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.15వేల విలువైన చెక్కులను ఆయన కార్యాలయంలో గురువారం అందజేశారు. ఎస్‌బీ ఏసీపీ నాగేంద్రగౌడ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, హోంగార్డు ఆర్‌ఐ పెద్దన్న తదతరులు పాల్గొన్నారు.


