నగర అభివృద్ధికి కృషి చేద్దాం | - | Sakshi
Sakshi News home page

నగర అభివృద్ధికి కృషి చేద్దాం

Mar 13 2026 7:37 AM | Updated on Mar 13 2026 7:37 AM

● మొదటి సాధారణ సమావేశంలో మంచిర్యాల మేయర్‌ మధుకర్‌

మంచిర్యాలటౌన్‌: నగర అభివృద్ధికి కృషి చేద్దామని నగరపాలక సంస్థ మేయర్‌ దర్ని మధుకర్‌ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో మొదటి సాధారణ సమావేశాన్ని మేయర్‌, డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య, కమిషనర్‌ అన్వేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించా రు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. తాగునీటి సమస్య లేకుండా చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించా రు. సమావేశ మందిరం నిర్మాణానికి రూ.50 లక్షలు ముందుగా కేటాయించగా, ఫర్నిచర్‌, ఇంటీరియర్‌ డెకరేషన్‌, సౌండ్‌ సిస్టం కోసం రూ.10 లక్షలు, మ హాప్రస్థానంలో ట్యాంక్‌ నిర్మాణానికి రూ.15 లక్షలను సాధారణ నిధుల నుంచి కేటాయిస్తూ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ క్యాబిన్లు, కమిషనర్‌ నూతన చాంబర్‌ కోసం నిధుల కేటాయింపుతోపాటు, వివిధ పనులకు రూ.1.11 కోట్లు కేటాయించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో నీ టి సరఫరా, ఎలక్ట్రికల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల కాలపరిమితి మార్చి 2025తో ముగియనుండగా, 2027 మార్చి వరకు వేతనాల కోసం అయ్యే వ్యయం రూ.1.83 కోట్లు మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి చెల్లించేందుకు పరిపాలన ఆమోదం పొందారు. తాత్కాలికంగా 11మంది ట్యాంకర్‌ డ్రైవర్లను మార్చి 2027వరకు తీసుకునేందుకు గాను రూ.19.80 లక్షల మంజూరుకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. నస్పూరుతోపాటు విలీన గ్రా మాల్లో తాగునీటి సరఫరా నిర్వహణ, అభివృద్ధికి రూ.32.95 లక్షలు, మంచిర్యాలలో తాగునీటి సరఫరా నిర్వహణకు రూ.25 లక్షలు, నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరిలో చేసిన ఖర్చు రూ.24.23 లక్షలకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ప్రతీ డివిజన్‌కో కార్యాలయం చొప్పున 60 డివిజన్లలో నిర్మించేందుకు రూ.1.40 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కా ర్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ కోసం రోజువారీ కార్మికులను తీసుకునేందుకు గాను రూ.40లక్షల సాధారణ నిధులకు పరిపాలన ఆమోదం తెలిపారు. మంచిర్యాల కా ర్పొరేషన్‌లో ఆస్తి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నుల బకాయిల వసూలుకు అవగాహన, విస్తృత ప్రచా రం నిర్వహించేందుకు నాలుగు ఆటోలను మార్చి 31వరకు ఎంగేజ్‌ తీసుకునేందుకు రూ.3.10లక్షలు కేటాయిస్తూ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement