నస్పూర్: సహారా ఇండియా సంస్థలో గడువు తీరిన ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులు వెంటనే చెల్లించాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, తె లంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య డిమాండ్ చేశారు. గురువా రం ఆయన బాధితులతో కలిసి సీసీసీ కార్నర్‌లోని సహారా ఇండియా సంస్థ కార్యాలయం ఎ దుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ కుమారస్వామికి వినతిపత్రం అందజేశారు. 15రోజుల్లో డబ్బులు చెల్లించకుంటే మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, నస్పూర్ కార్యాలయాల ఎదుట సామూహిక ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. బాధితులు వెంకట్‌రె డ్డి, పెద్దపల్లి మల్లయ్య, మోతె కాంతయ్య, రాజ మౌళి, అంకం సతీశ్, శంకర్, మల్లయ్య, అరుణ, నక్షత్ర, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


