అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలి

Mar 13 2026 7:37 AM | Updated on Mar 13 2026 7:37 AM

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● ప్రజాప్రతినిధులకు శిక్షణ

రామకృష్ణాపూర్‌: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హుల కు అందేలా చూడాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూ చించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అ మ్మాగార్టెన్స్‌లో గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్ర ణాళికపై సర్పంచులు, మంచిర్యాల మేయర్‌, డి ప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కా ర్యక్రమానికి హాజరై మాట్లాడారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీ టి సరఫరా, పైపులైన్ల మరమ్మతులు, పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలపై ప్రజాప్రతినిధులకు త్వరలో అవగాహన కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలి క వసతుల కల్పనపై దృష్టి సారించాలని, స్వయం సహాయక సంఘాల మహిళలూ భాగస్వాములు కా వాలని సూచించారు. అర్హులకు రేషన్‌కార్డులు అందేలా చూడాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నా రు. కాగా, శిక్షణ కార్యక్రమం కొనసాగుతుండగా ప్ర జాప్రతినిధులంతా భోజనాలకు వెళ్లారు. దీంతో భో జనాల ఏర్పాటుకు కారణమైన అధికారికి షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. డీసీపీ భా స్కర్‌, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, డీపీవో వెంకటేశ్వర్‌రావు, ఆయా డిపార్ట్‌మెంట్ల అధికారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement