మంచిర్యాలటౌన్: 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపున్న బాలికలు హెచ్‌పీవీ టీకా తీసుకోవాలని ప్రోగ్రాం అ ధికారి డాక్టర్ అనిల్‌కుమార్ సూచించారు. జిల్లా వై ద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బాలికలకు అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివా రించేందుకు ఉద్దేశించిన టీకాలను ప్రభుత్వం ఉచి తంగా ఇస్తోందని తెలిపారు. మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్‌లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలకు తల్లిదండ్రుల నుంచి సమ్మతిపత్రంతో పాటు ఆధార్‌కార్డు తీసుకువెళ్లాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థినులు ఒత్తిడికి గురికా కుండా పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు. హె ల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నాందేవ్, దీక్షితారాణి, ప్రిన్సిపాల్ సంధ్య, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసరావు, ఏఎన్‌ఎం రాజేశ్వరి, పాఠశాల స్టాఫ్ నర్సు శ్రీలత ఉన్నారు.


