సమస్యలు పరిష్కరించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని వినతి

Mar 17 2026 7:27 AM | Updated on Mar 17 2026 7:27 AM

చెన్నూర్‌: జైపూర్‌ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటులో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎస్టీపీపీ ఈడీ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీ సీఎంవో ఏఐ అధ్యక్షుడు పంతులా మాట్లాడుతూ సింగరేణి అధికారుల జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు కోలిండియా మాదిరిగా ఇవ్వాలని, సీఐఎల్‌ మాదిరిగా ప్రయోజనాలు కల్పించాలని, పదోన్నతులు కల్పించాలని, క్రమశిక్షణ చర్యల ప్రక్రియ సరైన పద్దతిలో జరగడంలేదని, దానిని సరిచేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో జీఎంలు నర్సింహారావు, మదన్‌మోహన్‌, డీజీఎంలు శివప్రసాద్‌, మహేందర్‌, శ్రీధర్‌, వేణుగోపాల్‌, ఎస్‌ఈ రాము, సీఎంవోఏఐ వైస్‌ ప్రెసిడెంట్‌ జనగామ శ్రీనివాస్‌, అప్పారావు, జాయింట్‌ సెక్రెటరీ మోహన్‌సింగ్‌, ఎస్‌వోటూ ఈడీ వెంకటయ్య, రక్షణాధికారి పులి సురేశ్‌ పాల్గొన్నారు.

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి

చెన్నూర్‌: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఎస్టీపీపీ ఈడీ సీహెచ్‌.చిరంజీవి అన్నారు. సోమవారం ఎస్టీపీపీలో పవర్‌మేక్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జీఎంలు మదన్‌మోహన్‌, నర్సింహారావు, పీఎంపీఎల్‌ హెడ్‌ అఖిల్‌కపూర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం గొప్ప మానవతా సేవ అని అభినందించారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాల్లో ఉద్యోగులు, కార్మికులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. శిబిరంలో 70 యూనిట్ల రక్తం సేకరించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సోసైటీ జిల్లా జనరల్‌ సెక్రెటరీ చందూరి మహేందర్‌, ఎస్టీపీపీ వైద్యులు జానకి, అధికారులు పంతులా, కిరణ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement