కిడ్నీలు పదిలమేనా..? | - | Sakshi
Sakshi News home page

కిడ్నీలు పదిలమేనా..?

Mar 12 2026 7:18 AM | Updated on Mar 12 2026 7:18 AM

● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న డయాలసిస్‌ బాధితులు ● లక్షణాలు లేకుండానే కిడ్నీలపై ముప్పు ● జీవనశైలిలో మార్పులతోనే రక్షణ ● నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం

రక్తపోటుపై నియంత్రణ లేకపోవడం

దీర్ఘకాలంగా మధుమేహం

పెయిన్‌ కిల్లర్లు, యాంటాసిడ్‌ మందుల అధిక వినియోగం

అధిక ఉష్ణోగ్రతల వాతావరణంలో పనిచేయడం

నీళ్లు ఎక్కువగా తాగకపోవడం

కిడ్నీల్లో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు

జన్యుపరమైన సమస్యలు

రాత్రిపూట తరచూ మూత్రవిసర్జన

మూత్రంలో రక్తం, నురగరావడం

కండ్లు, కాళ్లు, పాదాలు, మడమల వద్ద వాపు

తీవ్రమైన అలసట, నిద్రలేమి, నీరసం

వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం

చర్మం పొడిబారడం, తీవ్రమైన దురద

మూత్ర విసర్జన సమయంలో మంట

నడుం నొప్పి... రక్తపోటు పెరగడం

కండరాల నొప్పి, తిమ్మిర్లు రావడం

శరీరానికి తగినంత వ్యాయామం అందించాలి

రక్తంలో షుగర్‌ స్థాయిని అదుపులో ఉంచుకోవాలి

రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

బరువును అదుపులో ఉంచుకోవాలి

తగినంత నీరు తాగాలి

ధూమపానం అలవాటు మానాలి

నిర్మల్‌ఖిల్లా/నిర్మల్‌చైన్‌గేట్‌: కిడ్నీ వ్యాధులు నిశ్శబ్దంగా మనిషి శరీరాన్ని కబళిస్తున్నాయి. ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించకపోవడంతో చాలా మంది తీవ్ర స్థాయికి చేరిన తర్వాతే సమస్యను గుర్తిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటీవల డయాలసిస్‌ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం, ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అలవాటు లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం, డయాలసిస్‌పై అవగాహన కోసం 2006 నుంచి ఏటా మార్చి రెండో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న బాధితులు

మనిషి శరీరంలో కిడ్నీలు (మూత్రపిండాలు) అత్యంత కీలకమైన అవయవాలు. రక్తాన్ని శుద్ధి చేస్తూ, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ఈ ’ఫిల్టర్లు’ దెబ్బతింటే ప్రాణాలకే ప్రమాదం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మారుతున్న ఆహారపు అలవాట్లు, కలుషిత నీరు, మితిమీరిన పెయిన్‌ కిల్లర్స్‌ వాడకం వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్నినెలలక్రితం ఆదిలాబాద్‌ జిల్లాలోని నేరడిగొండ, భీమ్‌పూర్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలోని కెరమెరి మండలాల్లో వందలసంఖ్యలో ఏకకాలంలో కిడ్నీ వ్యాధిబారిన పడిన సంఘటన విస్మయానికి గురిచేసింది. కలుషిత నీటివనరులు, వంశపారంపర్య కారణాలతోనే ఇలా జరిగే అవకాశముందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

కిడ్నీల పనితీరు ఇలా..

కిడ్నీలు శరీరంలో వెన్నుముకకు ఇరువైపులా 9–10 సెంటీమీటర్ల వెడల్పుతో పాటు 150 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. కిడ్నీలు ప్రధానంగా శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. నీటి లవణాల సమతుల్యత కాపాడుతాయి. రక్తపోటు నియంత్రణకు సహకరిస్తాయి.

నిర్మల్‌ జనరల్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రం

నిర్మల్‌

కుమురంభీం

ఉమ్మడి జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు

కిడ్నీలు దెబ్బతినడానికి ప్రధాన కారణాలు

లక్షణాలు

కిడ్నీల ఆరోగ్య సూత్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement