ఇంట్లో చోరీ..
కడెం: మండల కేంద్రంలో పట్టపగలే ఇంట్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శివానందగౌడ్ ఇంటికి తాళం వేసి ఉంది. గురువారం మధ్యాహ్నం ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ప్లాస్టిక్ డబ్బాలు ఎరుకుంటూ ఆ ఇంట్లో చొరబడ్డారు. బీరువా పగులగొట్టి బంగారం, డబ్బులు ఎత్తుకెళ్తుండగా స్థానికులు అనుమానం వచ్చి అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి బంగారం చైన్, డబ్బులు స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని దొంగలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయమై ఎస్సై సాయికిరణ్‌ను సంప్రదించగా ముగ్గురితోపాటు, మరికొందరు ఉన్నారని, వారి గురించి విచారిస్తున్నట్లు తెలిపారు.


