బాసర: ఆర్జీయూకేటీలో అంతఃప్రజ్ఞ 2కే26 కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఆదివారం కెమి కల్, సివిల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ విభాగాలు సంయుక్తంగా ప్రాజెక్ట్ ఎక్స్‌పో నిర్వహించాయి. విద్యార్థులు పలు సృజనాత్మక ప్రా జెక్టులను ప్రదర్శించారు. వీసీ, ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శన్ పరిశీలించారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి పర్యావరణానికి అనుకూలమైన శుభ్రపర్చే పదార్థాన్ని తయారు చేసే హస్క్ ఆధారిత డిటర్జెంట్, బయోప్లాస్టిక్, తక్కువ ఖర్చుతో నీటిని శుద్ధి చేసే వాటర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. బైమెటాలిక్ స్ట్రిప్, సన్‌ఫ్లవర్ ఆధారిత సోలార్‌ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ద్వారా పునరుత్పత్తి శక్తిని వినియోగం, భవనాల ఎత్తు పెంచే ఆధునిక హైడ్రాలిక్ జాక్ సిస్టమ్, ఆటోమొబైల్ మోడళ్లు ఇంజినీరింగ్ నమూనాలను ప్రదర్శించారు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఎస్.వినయ్‌కుమార్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఎ.కిరణ్ కుమార్, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఎస్.కె. ఖలీల్, ఫ్యాకల్టీ కన్వీనర్ జంగలే స్వప్నిల్, అధ్యాపకులు ఉన్నారు.


