బెల్లంపల్లి: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నా లుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాని డిమాండ్ చే స్తూ ఈనెల 23న హైదరాబాద్ ఆర్‌ఎల్‌సీ కా ర్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివా స్ తెలిపారు. కార్మికులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. గురువా రం బెల్లంపల్లి సింగరేణి సివిల్ విభాగం కార్యాలయ ఆవరణలో ధర్నా పోస్టర్ ఆవిష్కరించా రు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మి కవర్గానికి అత్యంత ప్రమాదకరమని, వీటిని నివారించాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో ఈనెల 16న కలెక్టరేట్‌లు ముట్టడిస్తామని తెలిపారు. నాయకులు కృష్ణవేణి, వెంకటి, ల త, కొమురయ్య, శ్రీనివాస్, భాను, అమృత, మైసక్క, చంద్రకళ, కరుణ, వెంకటేశ్, బుచ్చ వ్వ, రాజేశ్వరి, కుమార్ తదితరులున్నారు.
పాతమంచిర్యాల: నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని ఈ నెల 16న తలపెట్టిన ‘కలెక్టర్ ముట్టడి’ పోస్టర్‌ను జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవన్‌లో ఆవిష్కరించారు. కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంతెన మల్లన్న కోరారు. నాయకులు సురేందర్, రాజేశ్, తిరుపతిరెడ్డి, దేవన్న, అరుణ, సత్యం పాల్గొన్నారు.


