పొదుపుతో భరోసా.. | - | Sakshi
Sakshi News home page

పొదుపుతో భరోసా..

Mar 17 2026 7:27 AM | Updated on Mar 17 2026 7:27 AM

● వంట ప్రా రంభించే ముందే కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ● పప్పులు, శనగలు, తదితర ధాన్యాలను ముందుగానే నానబెట్టడం వల్ల వండే సమయం తగ్గుతుంది. ● ప్రెషర్‌ కుక్కర్‌ వినియోగం కూడా ఆదాకు ఉపకరిస్తుంది. ● వంట సమయంలో అవసరానికి అనుగుణంగా మంట ఉంచాలి. అధిక మంట గ్యాస్‌ను వృథా చేస్తుంది. ● పాత్రకు సరిపోయే పరిమాణంలో మాత్రమే బర్నింగ్‌ ఫ్లేమ్‌ను ఉపయోగించాలి. ● వంటపాత్రలకు మూతపెట్టి వండడం వల్ల వేడి బయటకు పోకుండా గ్యాస్‌ ఆదా అవుతుంది. ● ఒకేసారి వండే విధంగా వంటకాలను ముందుగా ప్రణాళిక చేసుకోవాలి. ● వంటపాత్రల అడుగుభాగం సమతలంగా ఉండేలా చూసుకోవాలి. ● స్టౌ బర్నర్‌లు, నాజిల్స్‌ను తరచూ శుభ్రం చేస్తే మంట సంపూర్ణంగా వస్తుంది. వృథా ఉండదు. ● సిలిండర్‌, రెగ్యులేటర్‌, పైపులైన్లలో లీకేజీలు ఉన్నాయో లేదో తరచూ తనిఖీ చేయాలి. ● ఫ్రిజ్‌ నుంచి తీసిన పదార్థాలు కొంతసేపు బయ ట ఉంచి తర్వాత వండితే సమయం తగ్గుతుంది. ● వండిన ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయవద్దు. ● తక్కువ నీటితో వండే విధానాలను అలవాటు చేసుకోవాలి. ● సౌరశక్తి లేదా ఇతర ప్రత్యామ్నాయ వనరులను వీలైనంతవరకు ఉపయోగించుకోవాలి.

పరిమిత వనరులకు అపరిమిత వినియోగం ముప్పు దుబారా తగ్గిద్దాం..భవిష్యత్‌ను కాపాడుదాం ప్రస్తుత పరిణామాలు అందిస్తున్న సందేశమిదే...

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మన దైనందిన జీవితంపై ఎంతటి ప్రభావం చూపగలవో ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్‌–ఇజ్రాయిల్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా యుద్ధ సంక్షోభంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతూ ఇంధన వనరుల సరఫరాపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పరిమిత వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సహజవనరుల స్థితిగతులు, వినియోగంపై కథనం.

నిర్మల్‌ఖిల్లా/బోథ్‌: ఇటీవల గ్యాస్‌ కొరత వస్తుందనే వార్తలు వ్యాపించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అప్రమత్తమయ్యారు. గ్యాస్‌ గోదాముల వద్ద వి నియోగదారులు బారులు తీరుతున్నారు. కేవలం సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే ముందుచూపు ప్రదర్శించడం కాకుండా, రోజువారీ జీవితంలోనే పొదుపు, మిత వినియోగం వంటి అలవాట్లను అలవరుచుకోవడం అవసరమని ప్రస్తుత పరిస్థితులు పాఠాలు నేర్పుతున్నాయి. పరిమితంగా వాడితేనే వనరులు ఎక్కువకాలం నిలు స్తాయని సందేశం మనకు చేరవేస్తున్నాయి.

దుబారా తగ్గితేనే..

ప్రస్తుత జీవన విధానంలో గ్యాస్‌, విద్యుత్‌, పెట్రోల్‌ వంటి వనరులు అనివార్యంగా మారాయి. వంటగదిలో గ్యాస్‌, ప్రయాణానికి పెట్రోలు, దైనందిన పనులకు విద్యుత్‌ ఇవన్నీ మన జీవితంలో భాగమయ్యాయి. కానీ అవసరానికి మించి వినియోగించడం వల్ల వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. గ్యాస్‌ వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు ఆఫ్‌ చేయడం, చిన్న దూరాలకు వాహనాలు వినియోగించకుండా నడకకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి చిన్నచిన్న చర్యలు కూడా పెద్ద మార్పునకు దారితీస్తాయి.

వంటగ్యాస్‌ పొదుపు చిట్కాలివే..

ఉమ్మడి జిల్లా అటవీ విస్తీర్ణం

(చదరపు కిలోమీటర్లలో)

జిల్లా అటవీ విస్తీర్ణం

కుమురంభీం 1,778.26

మంచిర్యాల 1,564.93

ఆదిలాబాద్‌ 1,145.76

నిర్మల్‌ 1,085.02

గ్యాస్‌ కనెక్షన్ల వివరాలు (2025 వరకు)

జిల్లా గ్యాస్‌ కనెక్షన్లు

ఆదిలాబాద్‌ 2,82,200

కుమురంభీం 1,90,000

మంచిర్యాల 3,45,200

నిర్మల్‌ 2,69,300

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల గణాంకాలు

జిల్లా వాహనాలు

నిర్మల్‌ 10,194

ఆదిలాబాద్‌ 9,623

కుమురంభీం 6,626

మంచిర్యాల 11,760

ప్రస్తుత తరమే వనరులను అధికంగా వినియోగిస్తే రాబోయే తరాలకు వాటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ప్రకృతి వనరులను సంరక్షించడం ప్రతీ పౌరుడు బాధ్యతగా భావించాలి. పొదుపు, మిత వినియోగం, సంరక్షణ అనే మూడు సూత్రాలను పాటిస్తేనే భవిష్యత్‌ తరాలకు ఈ వనరులను అందించగలుగుతాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement