‘ప్రగతి ప్రణాళిక’పై నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

‘ప్రగతి ప్రణాళిక’పై నిర్లక్ష్యం వద్దు

Mar 16 2026 7:25 AM | Updated on Mar 16 2026 7:25 AM

చెన్నూర్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’పై అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని పలు వా ర్డుల్లో పర్యటించారు. వాటర్‌ ట్యాంకుల నిర్మాణాలు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కమిషనర్‌ మురళీకృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరా ల మాదిరి వీధులు శుభ్రంగా ఉంచాలన్నారు. డ్రెయినేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. సకాలంలో ఇంటిపన్ను చెల్లించి మున్సిపల్‌ అభివృద్ధికి సహకరించాలన్నారు. వార్డుల పరిశుభ్రత మున్సిపల్‌ అధికా రుల బాధ్యత అన్నారు. ఎక్కడైనా పారిశుధ్యం లోపి స్తే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రగతి ప్రణాళిక 8 వార్డుల్లో పూర్తి అయ్యిందని, మరో 10 వార్డుల్లో చేపట్టాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెద్దింటి పద్మ శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ వినయ్‌కుమార్‌, కౌన్సిలర్లు నజ్మాఅమేర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement