మంచిర్యాలక్రైం: ఇంట్లో బెడ్రూంలో డోరు లా క్ పడి లోపల ఉన్న చిన్నారిని సురక్షితంగా కా పాడి ఫైర్ సిబ్బంది శభాష్ అనిపించుకున్నా రు. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాకేంద్రంలోని చున్నంబట్టివాడలో సుద్దాల అజయ్–సుస్మిత దంపతులకు కుమార్తె అద్వైత(2) ఉంది. గురువారం ఇంట్లో బెడ్రూంలో ఆడుకుంటూ డోర్ లాక్ పడింది. డోర్ తెరువకపోవడంతో అజయ్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకున్నారు. లాడర్ సహాయంతో మూడు అంతస్తులపై భవనం పైకి చేరుకుని వెంటిలేషన్ డ్రిల్స్ తీసివేశారు. గదిలో చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, స్థానికులు ఫైర్ సిబ్బందిని అభినందించారు.


