సరిపడా గ్యాస్‌ సిలిండర్లు | - | Sakshi
Sakshi News home page

సరిపడా గ్యాస్‌ సిలిండర్లు

Mar 14 2026 7:25 AM | Updated on Mar 14 2026 7:25 AM

● కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు ● పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

● కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు ● పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రజలకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా రాష్ట్రంలో ఎల్‌పీజీ సిలిండర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రా వు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్‌, వివిధ శాఖల అధికారులతో ఎల్‌పీజీ సిలిండర్ల నిల్వ లు, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, రబీ పంటల సాగు, ధాన్యం కొనుగోలు కార్యాచరణ అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్‌ కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని, అధికారులు ఆయిల్‌ కంపెనీలతో ప్రతీరో జు సమీక్షించాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎల్‌పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేసి ప్రతీరోజు సమీక్షించాలని అన్నారు. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ గ్యాస్‌ డీలర్లతో సమావేశం నిర్వహించి బుకింగ్‌ నిల్వలపై సమీక్షిస్తున్నామని అన్నారు. డీసీపీ భాస్కర్‌, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, నీటిపారుదల శాఖ ఈఈ విష్ణుప్రసాద్‌, వ్యవసాయ అధికారి సురేఖ, పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ శ్రీకళ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement