సీ్త్రనిధి ఏజెంట్‌ చేతివాటం | - | Sakshi
Sakshi News home page

సీ్త్రనిధి ఏజెంట్‌ చేతివాటం

Mar 10 2026 1:22 PM | Updated on Mar 10 2026 1:22 PM

● రూ.7 లక్షలు సొంతానికి వాడుకున్న వైనం

● రూ.7 లక్షలు సొంతానికి వాడుకున్న వైనం

సాత్నాల: భోరజ్‌ మండలంలోని గూడ గ్రామంలో వీవోఏ (విలేజ్‌ ఆర్గనైజింగ్‌ అసిస్టెంట్‌)గా విధులు నిర్వహిస్తున్న రాయిడి స్వప్న సీ్త్రనిధి సంఘం సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులు సొంతానికి వాడుకోవడం కలకలం రేపింది. ఎస్సై పవర్‌ గౌతమ్‌ కథనం మేరకు గ్రామానికి చెందిన వీవోఏ రాయుడి స్వప్న సీ్త్రనిధి స్వయం సహాయక సంఘాలకు ఏజెంట్‌గా పనిచేస్తుంది. 2022 నుంచి 10 సంఘాలు, 54 మంది సభ్యులు శ్రీనిధి రుణాలు తీసుకున్నారు. సదరు మహిళల వద్ద నుంచి ప్రతీనెల డబ్బులు వసూలు చేసి బ్యాంకులో కట్టినట్లుగా రసీదులు చూపించింది. గడువు ముగిసిన తర్వాత దుమ్మ సంగీత, దుమ్మ బూమక్క, కోర చిన్నమ్మ, నలిమెల కాంత మళ్లీ రుణంకోసం అడుగగా బ్యాంకులో తీసుకున్న పాత లోన్‌ డబ్బులు పూర్తిగా కట్టలేదని అన్నారు. దీంతో సదరు మహిళలు స్వప్నను సంప్రదించగా రూ.7 లక్షలు వాడుకున్నట్లు ఒప్పుకుంది. నెలరోజులకు చెల్లిస్తానని బాండు రాసి ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత సీ్త్రనిధి సంస్థకు చెందిన అధికారులు డబ్బుల విషయం అడుగగా నేను ఇవ్వలేనని చెప్పింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

చిన్నారికి నారీ పురస్కార్‌

ఆదిలాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్‌ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన కల్చరల్‌, ఫ్యాషన్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో జిల్లాకు చెందిన కొంకటి ఇతిక్ష విశేష ప్రతిభ కనబర్చింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ గౌరవ సభ్యురాలు సరిత గోగుల, నేషనల్‌ బంజారా భారత్‌ మహిళా కన్వీనర్‌ అద్దంకి నాగమణి, ప్రముఖ నటి సంధ్యారాణి చేతుల మీదుగా నారీ పురస్కారాన్ని అందుకుంది. చిన్నారి తల్లిదండ్రులు కొంకటి సృజన, శ్రావణ్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement