బైక్‌ అదుపుతప్పి సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపుతప్పి సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు మృతి

Mar 10 2026 1:22 PM | Updated on Mar 10 2026 1:22 PM

మందమర్రిరూరల్‌: మందమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు. నెన్నెల గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు బర్ల శంకర్‌ (64) తన భార్య రాజేశ్వరితో కలిసి ద్విచక్ర వాహనంపై మంచిర్యాల నుంచి నెన్నెల వైపు వెళ్తుండగా టోల్‌ప్లాజా వద్ద బైక్‌ అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేశ్వరికి గాయాలు కావడంతో గమనించిన స్థానికులు మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు కార్తీక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

డ్రెయినేజీలో పడ్డ ఆవు సురక్షితం

చెన్నూర్‌: పట్టణంలోని కోర్టు సమీపంలో ఓ ఆవు సోమవా రం ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడిపోయింది. బయటికి రా వడానికి మార్గం లేక పోవడంతో ఇబ్బంది పడుతోంది. చెత్తను తొలగించేందుకు వెళ్లిన మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు కనిపించడంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉదయ్‌కుమార్‌కు సమాచారం అందించారు. అతని ఆదేశాల మేరకు సిబ్బంది ఆ వును బయటకు తీసి యజమానికి అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement