పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న ఈ సమయంలో విద్యార్థులు అనవసరంగా ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛ వాతావరణంలో చదవాలి. లక్ష్యాన్ని ఎంచుకుని క్రమపద్ధతిలో కృషి చేస్తే విజయం సాధించడం కష్టంకాదు. ‘ఒత్తిడిని భయంగా కాకుండా సవాల్‌గా తీసుకుంటే విజయం కచ్చితంగా సిద్ధిస్తుంది. – అల్లం సాయికృష్ణ,
కెరీర్ గైడెన్స్ నిపుణులు, బోథ్, ఆదిలాబాద్
ఒత్తిడికి గురికావొద్దు
పరీక్షల సమయంలో విద్యార్థులు అనవసరమైన ఒత్తిడికి గురికావొద్దు. ప్రతిరోజూ చదువు కోసం సమయపట్టిక రూపొందించుకుని మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా సరిపడా నిద్ర, సమతుల్య ఆహారం, తేలికపాటి వ్యాయామం మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. పరీక్షలను జీవితంలో ఒక దశగా మాత్రమే భావించాలి. ఫలితాలకంటే నేర్చుకున్న జ్ఞానమే ప్రధానం.
– అడ్డిగ శ్రీనివాస్,
సైకాలజిస్టు, మోటివేషన్ స్పెషలిస్టు


