ఆర్జీయూకేటీలో హ్యాకథాన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్జీయూకేటీలో హ్యాకథాన్‌

Mar 10 2026 1:22 PM | Updated on Mar 10 2026 1:22 PM

బాసర: బాసర ఆర్జీయూకేటీలో సోమవారం 9 ఏఎం కెరీర్స్‌ సంస్థ ఆధ్వర్యంలో నోవా కోడ్‌ చాలెంజ్‌ (హ్యాకథాన్‌) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి సురేశ్‌ విద్యార్థులకు ఐటీ రంగంలో ఉన్న అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలు పరిశ్రమలో చేరడానికి అనుసరించాల్సిన మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి టెక్‌మోజో సంస్థకు చెందిన సీనియర్‌ హెచ్‌ఆర్‌ మణిదీప్‌ కూడా హాజరై విద్యార్థులతో పరస్పర చర్చలు జరిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ గోవర్ధన్‌, ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ ప్రొఫెసర్‌ పి.మురళీ దర్శన్‌, అసోసియేట్‌ డీన్‌ కె.మహేష్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం హెడ్‌ డా.బి.వెంకటరామన్‌, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు శ్రీమతి జి.సృజనా లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement