బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీఓఈ) పాఠశాల/కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగుర వేశారు. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 9 వరకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో అండర్–14 విభాగంలో జరిగిన పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లా జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. 03–02 పరుగుల తేడాతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు బంగారు పతకాలు సాధించిందని సీవోఈ కళాశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ తెలిపారు.


