మృత్యుపాశాలు..! | - | Sakshi
Sakshi News home page

మృత్యుపాశాలు..!

Mar 10 2026 1:21 PM | Updated on Mar 10 2026 1:21 PM

● ఇనుప స్టాండ్‌కు తగిలిన విద్యుత్‌ తీగలు ● షాక్‌తో ఇద్దరి దుర్మరణం.. మంటలు చెలరేగి దహనం ● కాపాడే ప్రయత్నంలో షాక్‌తో ఎగిరిపడ్డ తోటి వ్యక్తి ● అందరూ చూస్తుండగానే ఘోరం

– వివరాలు

మెయిన్‌లో...

దండేపల్లి: సాయం చేయబోయిన కూలీలకు మృత్యుపాశాలు ఎదురయ్యాయి. రోజువారీ కూలితో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఇద్దరిని మృత్యు ఒడికి చేర్చాయి. ఇనుప స్టాండ్‌ను తీసుకెళ్తుండగా పైనున్న విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌తో విలవిలలాడుతున్న వారిని చూసి అక్కడున్న వారి గుండెలవిసిపోయాయి. క్షణాల్లో మంటలు ఎగిసిపడి నిలువునా కాల్చేశాయి. ప్రతిరోజులాగే పనులకు వెళ్లిన వారు ఇంటికి వస్తారని చూసే ఆ కుటుంబాలకు ఇక ఎదురుచూపులే మిగిలాయి. దండేపల్లి మండలం మేదరిపేట పెట్రోల్‌బంక్‌ సమీపంలో సోమవారం జరిగిన ఈ విషాదకర సంఘటనలో మండలంలోని మాదాపూర్‌కు చెందిన చల్ల లక్ష్మీనారాయణ(50), వెల్గనూర్‌ గ్రామానికి చెందిన చందనగిరి నాగరాజ్‌(35) మృత్యువాతపడ్డా రు. వారిని కాపాడేందుకు దుకాణంలో ఉండే గంగాధర్‌ ప్రయత్నించగా.. అతడికీ షాక్‌ రావడంతో ఎగిరి పక్కకు పడి స్వల్పంగా గాయపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement