బాసర: బాసర ఆర్జీయూకేటీని శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష స మావేశం నిర్వహించారు. విద్యార్థుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. అడ్మిషన్ల ప్రక్రి య గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ని యామకంలో తప్పనిసరిగా రిజర్వేషన్ పద్ధతిని పా టించాలని ఆదేశించారు. వివిధ అంశాలపై అధికా రులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులతో మా ట్లాడి వారికి అందిస్తున్న వసతులు, సౌకర్యాలు అడి గి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్, సభ్యులను యూనివర్సిటీ అధికారులు సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ స భ్యురాలు కుస్త్రం నీలాదేవి, వైస్ చాన్స్‌లర్ గోవర్ధన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.


