బెల్లంపల్లి: నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇ వ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం పట్టణంలో బీ జేపీ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. పాత బస్టాండ్ ఏరియా రోడ్డుపై పాదచారులు, షాపుల వద్దకు వెళ్లి యాచించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేశ్, కార్యదర్శి రాచర్ల సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. అర్హులను విస్మరించి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి, అధికా ర పార్టీ నాయకులు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికై నా అర్హులకు ఇళ్లు కేటా యించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ పట్టణాధ్యక్షురాలు దార కళ్యాణి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోమాస కమల, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి సురేశ్, పట్టణ కోశాధికారి సంతోష్ అగర్వాల్, నాయకులు మల్లేశ్, ఓంసాయి, రాము, ప్రశాంత్, శ్రీనివాస్, సా గర్, సందీప్, తేజవంశీ తదితరులు పాల్గొన్నారు.


