మంచిర్యాలరూరల్(హాజీపూర్): పల్లెల్లోని అంగన్‌వాడీ కేంద్రాల వ్యవస్థ మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంలో భాగంగా సర్పంచులు విశేష పాత్ర పోషిస్తున్నారు. గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతలు సర్పంచులకు అప్పగించా రు. అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్టం చేయడం, వి ద్యార్థులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా తీ సుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయంలో భాగంగా ఇప్పటికే విడుదలైన ఉత్తర్వుల మేరకు కమిటీలు ఏర్పాటయ్యాయి. 11 మంది సభ్యులతో కూడిన కమిటీకి చైర్మన్‌గా సర్పంచ్, కన్వీనర్‌గా అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు, స భ్యులుగా సామాన్య శాస్త్రం భోధించే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక విశ్రాంత ఉద్యోగి, ఒక ఏఎన్‌ఎం, చిన్నారుల తల్లులు, గర్భిణులు ఉంటారు.
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలోని మంచిర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 244, బెల్లంపల్లి అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో 282, లక్సెట్టిపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో 203, చెన్నూర్ రూ రల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 245తో కలిపి మొ త్తంగా 974 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో అర్బన్ ప్రాంతాల్లో 526, రూరల్ ప్రాంతాల్లో 446 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను సర్పంచులు పర్యవేక్షించనున్నారు.
నిరంతర పర్యవేక్షణ..
అంగన్‌వాడీ కేంద్రాలపై సర్పంచుల పర్యవేక్షణ ఇకపై నిరంతరాయంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి కేంద్రాలకు ప్రతీ నెల సరఫరా అవుతున్న సరుకులు వివరాలు, చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారం అందేలా చూడటంపై సర్పంచులు పర్యవేక్షించనున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందించే భోజనం నాణ్యతనూ తనిఖీ చేసే అధికారం ఉంది. పిల్లలు, కిషోర బాలికలు, బాలింతలు, గర్భిణులతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంపై అవగాహన కల్పించడంలో కూడా వీరి పాత్ర ఉంటుంది. అంగన్‌వాడీ కేంద్రానికి ప్రతీనెల వచ్చే రూ.లక్షల విలువ చేసే సరుకులు పక్కదారి పట్టకుండా, అంగన్‌వాడీ వ్యవస్థ పకడ్బందీగా సాగేలా పర్యవేక్షించనున్నారు. బాలామృతం, పాలు, గుడ్లు, బియ్యం, కందిపప్పు, తదితర పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూడనున్నారు. చిన్నారుల భద్రత, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం వంటి బాధ్యతలను కూడా సర్పంచులు చూడనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీలు ప్రతీ నెల సమావేశమై నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించి కేంద్ర బాగోగులకు చర్యలు చేపట్టనున్నారు.
సర్పంచులకు బాధ్యతలు
గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా ఎన్నికై న సర్పంచులకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. సర్పంచులు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ ప్రతీనెల కమిటీ సభ్యులతో సమావేశమై కేంద్రాలను పటిష్టం చేసేలా చర్యలు చేపడతాం.
– రౌఫ్‌ఖాన్, జిల్లా సంక్షేమాధికారి


