మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): రామకృష్ణాపూర్‌లోని బీజోన్ ఏరియాలో గల ఆర్‌సీఎం క్లబ్‌లో ఆదివారం ఫస్ట్ ఇంటర్ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే పోటీలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఇలాంటి క్రీడలతో క్రీడాకారుల్లో మనోధైర్యం, మానసిక పుష్టితో పాటు పలు శారీరక ధారుఢ్యం పెరుగుతుందన్నారు. విజేతలకు మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం పలువురు మహిళలను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జూల శ్రీనివాస్, ఆషాఢం శ్రీనివాస్, కరా టే మాస్టర్ రమేశ్‌రాజా, వివిధ ఏరియాల కరా టే మాస్టర్స్, కాంగ్రెస్ నాయకులు సమ్మయ్య, అజీజ్ తదితరులు ఉన్నారు.


