సులభ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సులభ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Mar 14 2026 7:26 AM | Updated on Mar 14 2026 7:26 AM

నస్పూర్‌: సింగరేణిలో పనిచేస్తున్న సులభ్‌ కార్మికు ల సమస్యలు వెంటనే పరష్కరించాలని సింగరేణి సులభ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డి.బ్రహ్మానందం డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన సులభ్‌ కార్మికులతో కలిసి శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రతీనెల 10 లోపు వేతనాలు చెల్లించ డం లేదన్నారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌, గత సంవత్సర కాలంగా పెండింగ్‌ ఉన్న డీఏ విడుదల చేయాలన్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు హాస్పిటల్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. సులభ్‌ కాంప్లెక్స్‌లు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటికి మరమ్మతులు చేపట్టాలన్నారు.జిల్లా నాయకులు శంకరి, మంతెన లక్ష్మయ్య, నేదురి, నర్సయ్య, లక్ష్మయ్య, రాజేందర్‌, పరుశరాములు, విజయ, రౌతు లక్ష్మి, జ్యోతి, సుగుణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement