రెబ్బెన: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ ఏరియా అధ్యక్షుడు గోలేటి శ్రీనివాస్, కార్యదర్శి అరికెళ్ల పోచం అన్నారు. ఐఎప్‌టీయూ ఆధ్వర్యంలో ఈనెల 16న కలెక్టరేట్ల ముట్టడి, 23న హైదరాబాద్ రీజినల్ లేబర్ కమిషనర్ కార్యాల యం ఎదుట నిర్వహించే ధర్నా పోస్టర్లను శుక్రవా రం గోలేటిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లను సింగరేణిలో అమలు చేయొద్దన్నా రు. లేబర్ కోడ్‌లను ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని గెజిట్ విడుదల చేసిందన్నారు. వీటిని రద్దు చేసేవరకు దేశవ్యాప్తంగా కార్మికవర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు భీమేశ్, చందు, వెంకటేశ్, చంద్రయ్య, కుమార్, పోసుబాయి, తార, నాగలక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు.


