స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

Mar 9 2026 7:39 AM | Updated on Mar 9 2026 7:39 AM

● ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

దండేపల్లి: అన్నీశాఖల అధికారులు సమన్వయంతో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చి దిద్దాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు సూచించారు. దండేపల్లిలో ఆదివారం నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పా రిశుద్ధ్య పనులు పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నిశాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి తాగు, సాగునీరు, విద్యుత్‌, వైద్యం, విద్య విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా డ్రెయినేజీ వ్యవస్థ బాగు చేయాలన్నారు. దండేపల్లిని స్వచ్ఛ మండలంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలన్నారు. అనంతరం పంచాయతీ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌పండ్‌ చెక్కులు అందించారు. కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, లక్సెట్టిపేట ఏఎంసీ చైర్మన్‌ ప్రేమ్‌చంద్‌, ఆర్‌జీపీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, ఎంపీడీవో ప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, సతీష్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement