సమాజంలో ప్రతి ఒక్కరూ నైతిక విలువలు నేర్చుకోవాలి. మహిళలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. నిర్భయంగా ఫిర్యాదు చేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తారు. నేరం చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారు. చట్టాలు అందరికీ సమానమే. మహిళల రక్షణకు కఠినమైన చట్టాలున్నాయి. వరకట్న వేధింపులు, గృహహింస, పోక్సో కేసుల్లో, లైంగికదాడి కేసుల్లో చట్టాలు కఠినంగా ఉన్నాయి. మహిళలకు సంబంధించిన కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తున్నాం.
– ఎగ్గడి భాస్కర్, డీసీపీ,
మంచిర్యాల


