మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్‌లో ఆదివారం సాహితీ సంరక్షణ సమి తి ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ ఉగాదికి స్వా గతం పలుకుతూ కవి సమ్మేళనం నిర్వహించా రు. ఈ సందర్భంగా కవులు పద్యవచనము, గే యము ద్వారా కవితాగానం చేశారు. పర అంటే బయట, ఉన్నతి అభవ అంటే లయము, అంతము మనలోని అహంకారము ద్వేషము లోభము, నెగిటివ్ భాగాలను అంతమయ్యే కా లమని, లోపాలను గుర్తించి ఆత్మపరిశీలన చే సుకొని సద్గుణాలతో నడవటం, బలహీనతపై విజయం సాధించే సంవత్సరమంటూ వక్తలు అభిప్రాయపడ్డారు. అనంతరం పలువురు కవులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు వామన్‌రావు, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడు మహేందర్, సుబ్బాయమ్మ, అడ్డగూరి శ్రీలక్ష్మి, శ్రీనివాస్, సంతోష్, చంద్రశేఖర్, బ్రహ్మయ్యచార్య పాల్గొన్నారు.


