ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్‌ ఢీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్‌ ఢీ

Mar 12 2026 7:18 AM | Updated on Mar 12 2026 7:18 AM

● ఐదుగురికి గాయాలు

భైంసాటౌన్‌: బాసర వద్ద ఆర్టీసీ బస్సును ఇసుక టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌ రియాజ్‌తో పాటు మరో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యా యి. నిజామాబాద్‌ నుంచి భైంసాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బాసర రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఫ్లైఓవర్‌ వద్ద ఇసుక టిప్పర్‌ ఢీకొట్టింది. బస్సు డ్రైవర్‌ రియాజ్‌తో పాటు నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై నవనీత్‌రెడ్డి క్షతగాత్రులను భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ రియాజ్‌, భైంసా డీఎం హరిప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నిర్మల్‌ ఏఎస్పీ సాయికిరణ్‌ ఏరియాస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement