బెల్లంపల్లి: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కా రం కోసం ఈనెల 17న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూ నియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటస్వామి, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, గోలేటి, బెల్లంపల్లి బ్రాంచి ఇన్‌చా ర్జి చిప్ప నర్సయ్య తెలిపారు. బెల్లంపల్లి సీపీఐ కా ర్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏసీబీ కేసు నమోదును ఆసరా తీసుకుని సింగరేణిలో మెడికల్ బోర్డును ఆపేయడం సరైంది కాదన్నారు. ఈ విషయాన్ని ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా యధాతథంగా బోర్డు కొనసాగి స్తామని హామీ ఇచ్చిన అమలుకావడం లేదన్నారు. మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల సింగరేణిలో అ వినీతి, కుంభకోణాలు జరుగుతున్నాయని ఈక్రమంలో ఆందోళన కార్యక్రమాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులోభాగంగా ఈనెల 17న గనులు, విభాగాల్లో నల్లబ్యాడ్జీలు ధ రించి ధర్నాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 18 నుంచి శ్రీరాంపూర్‌లో సేవ్ సింగరేణి జాతా ప్రారంభించి అన్ని ఏరియాల కార్మికులను చైతన్యపరుస్తామన్నారు. 30న కొత్తగూడెం హెడ్‌ఆఫీసు ఎదుట ధర్నా, ఏప్రిల్‌లో సమ్మె చేస్తామని ప్రకటించారు. సమావేశంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ఆడేపు రాజమౌళి, తిరుపతిగౌడ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, శ్రీధర్, రమేశ్, రాంచందర్, సాగర్, శేషికుమార్, రామకృష్ణ, వివేక్ పాల్గొన్నారు.


