భైంసాటౌన్: మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి నిర్మల్ జిల్లాకు ఇసుక అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాపై తనిఖీల్లో భాగంగా ఆదివారం ధర్మాబాద్ నుంచి బాసర–నిజామాబాద్ వైపు ఇసుక తరలిస్తున్న రెండు లారీలు, ఒక ఐషర్‌ను పట్టుకున్నట్లు చెప్పారు. వీటిలో రూ.1,01,400 విలువైన 78 టన్నుల ఇసుక ఉన్నట్లు పేర్కొన్నారు. జేసీబీతోపాటు బైక్ స్వాధీనం చేసుకుని 13 మందిపై కేసు నమోదు చేయగా ప్రధాన నిందితుడు షేక్ రవూఫ్‌తోపాటు ధర్మాబాద్‌కు చెందిన షేక్ జావిద్, లక్ష్మణ్, షేక్ ఇర్ఫాన్, రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ఇలియాస్ ఖాన్‌ను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. రవూఫ్‌పై ఇదివరకే బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులు, భైంసాటౌన్ పరిధిలో ఒక కేసు, నిర్మల్ టౌన్ పరిధిలో దోపిడీ కేసు, ధర్మాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం, ఇతర తీవ్రమైన నేరాల కేసులు 4 నమోదైనట్లు తెలిపారు.
ఏడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
లోకేశ్వరం: మండలంలోని సాథ్‌గాం సుద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను సోమవారం పట్టుకున్నట్లు తహసీల్దార్ భోజన్న తెలిపారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5 వేల జరిమానా విధించారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
భైంసారూరల్: మండలంలోని వానల్‌పాడ్ పరిసరా లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు రెవెన్యూఇన్‌స్పెక్టార్ దత్తాత్రేయ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.


