ఖానాపూర్: పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీలో గల మైనార్టీ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్న విద్యార్థికి తల్లిదండ్రుల అనుమతి లేకుండా పాఠశాల సిబ్బంది గుండు గీయించారు. విషయం తెలుసుకున్న సదరు విద్యార్థి తండ్రి రవి శనివారం పాఠశాలకు చేరుకుని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంప్రదాయం ప్రకారం తల్లి దండ్రులు చనిపోయినప్పుడు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మాత్రమే గుండు చేయించుకుంటారని, ఇలాంటి చర్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ హైమద్‌ను వివరణ కోరగా గుండు తీసిన విషయం తన దృష్టికి రాలేదని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.


