మంచిర్యాలఅగ్రికల్చర్: గ్యాస్ వినియోగదారులు ఆన్‌లైన్‌లో మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు సూచించారు. గురువారం ఆయన చాంబర్‌లో ఎల్‌పీజీ డీలర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్యాస్ కంపెనీల సేల్స్ అధికారులతో ఫోన్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో గృహావసరాల కోసం వినియోగించే డొ మెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని తెలిపారు. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలు, గోదాముల వద్దకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో మాత్రమే సిలిండ ర్లు బుక్ చేసుకోవాలని సూచించారు. గ్యాస్ బు కింగ్ గడువు సింగిల్ సిలిండర్ వారికి 25రోజు లు, డబుల్ సిలిండర్ వారికి 30 రోజుల వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు. సిలిండర్ డెలివరీ స మయంలో డెలివరీ బాయ్‌కి ఓటీపీ చెప్పి సహకరించాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో వాణిజ్య సిలిండర్ మాత్రమే వినియోగించాలని, నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగించినాస్తే కఠినచర్యలు తీసుకుంటామ ని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లను విక్రయించాలని చూస్తే నిత్యాసవరాల సరుకుల చట్టం 1955 కింద కఠి నచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవైసీ చేసుకోనివారు వినియోగదారులు వెంటనే చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


