సారూ.. సమస్య పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

సారూ.. సమస్య పరిష్కరించండి

Mar 10 2026 1:21 PM | Updated on Mar 10 2026 1:21 PM

● కలెక్టర్‌కు బాధితుల విన్నపం ● ప్రజావాణిలో అర్జీల సమర్పణ ● తాండూర్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇరవేని రాయమల్లు తన భూమికి నూతన పట్టా పాస్‌పుస్తకం ఇప్పించాలని దరఖాస్తు అందజేశాడు. ● బెల్లంపల్లి కూరగాయల మార్కెట్‌లో తనకు కేటాయించిన దుకాణాన్ని కొందరు ఆక్రమించుకున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాలని పట్టణానికి చెందిన దుర్గం మల్లేష్‌ ఫిర్యాదు చేశాడు. ● కన్నెపల్లి మండల కేంద్రానికి బోయ పోచం తనకు పూర్వీకుల నుంచి వస్తున్న భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాలని, పట్టాదారు పాస్‌పుస్తకం ఇప్పించాలని కోరాడు. ● లక్సెట్టిపేట ఊత్కర్‌ చౌరస్తాలోని వారసంతను వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు తరలించాలని ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక ప్రతినిధి తిరుపతి అర్జీ అందజేశాడు. ● తన తల్లి సుశీలకు వితంతు పింఛన్‌ ఇప్పించాలని నెన్నెలకు చెందిన గడ్డం స్వామిగౌడ్‌ వినతిపత్రం అందజేశాడు. ● రా రైస్‌మిల్లర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రతినిధి గుంట నాగరాజు డిఫాల్ట్‌ మిల్లర్లకు విధించిన 25శాతం జరిమానా, 12శాతం వడ్డీ మాఫీ చేసి ప్రభుత్వం నుంచి బకాయిలు ఇప్పించాలని దరఖాస్తు అందజేశాడు.

మంచిర్యాలఅగ్రికల్చర్‌: భూ సమస్యలు, పింఛన్లు, పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు, కన్న కొడుకులు పట్టించుకోవడం లేదని.. సమస్య పరిష్కరించండి సారూ.. అంటూ ప్రజలు ప్రజావాణిలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ను కలిసి విన్నవించారు. సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాస్‌లతో కలిసి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులు అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement