ముగిసిన అంతర్రాష్ట్ర వాలీబాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన అంతర్రాష్ట్ర వాలీబాల్‌ పోటీలు

Mar 17 2026 7:27 AM | Updated on Mar 17 2026 7:27 AM

● ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌

తాంసి: కరంజి(టి)లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర వాలీబాల్‌ పోటీలు సోమవారం ముగిశాయి. జైశ్రీరాం యూత్‌ ఆధ్వర్యంలో నితిన్‌ స్మారకార్థం నిర్వహించిన పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన 17 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌, సిద్దిపేట జట్లు తలపడగా హైదరాబాద్‌ జట్టు గెలుపొందింది. విజేత జట్టుకు ప్రథమ బహుమతి సర్పంచ్‌ కల్చప్‌ యాదవ్‌ రూ.31 వేల నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన సిద్దిపేట జట్టుకు కప్పల గజానన్‌ రూ.21వేల నగదు, తృతీయస్థానంలో నిలిచిన మాండ్వి జట్టుకు మాజీ సర్పంచ్‌ నరేందర్‌ యాదవ్‌ రూ.11వేల నగదుతో పాటు టోర్నీ నిర్వాహకులు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు దేవారెడ్డి, రెడ్డివార్‌ రమేశ్‌, గ్రామ యువకులు పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

ఉట్నూర్‌రూరల్‌: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. సోమవారం ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్‌ మండలం ఘనపూర్‌కు చెందిన ఆత్రం లోకేష్‌ పైచదువుల నిమిత్తం ల్యాప్‌టాప్‌ మంజూరు చేయాలని, సిర్పూర్‌కు చెందిన గేడం గజానంద్‌ ఏకలవ్య పాఠశాలలో స్లీపర్‌ ఉద్యోగం ఇప్పించాలని, సిరికొండకు చెందిన రామారావు సోలార్‌ పంపుసెట్‌ మంజూరు చేయాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్‌, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మం జూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement