జన్నారం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బాదంపల్లి గ్రామ సమీపంలోని గోదావరి నుంచి ఇసుక తీసుకొస్తున్నాం. అటవీశాఖ అధికారులు ‘ఎకో సెన్స్‌టివ్ ఏరియా’ అంటూ ఇసుక ట్రాక్టర్‌కు భారీగా జరిమానా విధించి కేసులు నమోదు చేస్తున్నారు. పక్క జిల్లా జగిత్యాలకు జేసీబీలతో ఇసుక తోడి తరలిస్తున్నారు. వారికి ఎలాంటి జరిమానాలు లేవు. ఇందిరమ్మ ఇళ్లు గోడల వరకు వచ్చి ఆగిపోయాయి. ఎస్సీ, ఎస్టీ నిరుపేదలమైన మాకు ఇంటి నిర్మాణానికి తీసుకొచ్చేందుకు అవకాశం కల్పించాలి. – ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, జన్నారం


