కోటపల్లి: మండలంలోని ఆలుగామలో బుధవారం పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సుమారు 1500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. నలుగురు మహిళల నుంచి 70 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ గుడుంబా మహమ్మరి వల్ల ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. గ్రామంలో గుడుంబా తయారు చేసినా విక్రయించినా దానికి అవసరమైన ముడిసరుకులు సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ సమ్మయ్య, కోటపల్లి ఎస్సై రాజశేఖర్, ఎకై ్సజ్ ఎస్సై వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.


