ఖానాపూర్‌లో విజిలెన్స్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఖానాపూర్‌లో విజిలెన్స్‌ తనిఖీలు

Mar 17 2026 7:27 AM | Updated on Mar 17 2026 7:27 AM

● 12 గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం ● 10 మందిపై 6ఏ కేసు నమోదు

● 12 గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం ● 10 మందిపై 6ఏ కేసు నమోదు

ఖానాపూర్‌: గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్లను వాణిజ్య దుకాణాల్లో విని యోగిస్తున్నారనే సమాచారం మేరకు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం ఖానాపూర్‌లో తనిఖీలు నిర్వహించారు. 10 దుకాణాల్లో 12 గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకుని 10 మందిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ శేఖర్‌రెడ్డి తెలిపారు. గృహాలకు సరఫరా చేసే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని, దుకాణ దారులు తప్పనిసరిగా లైసెన్స్‌ ఉన్న కమర్షియల్‌ సిలిండర్లనే వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై రాహెల్‌ గైక్వాడ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.

చిట్‌ఫండ్‌ చైర్మన్‌ రిమాండ్‌

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని చిట్‌ఫండ్‌ చైర్మ న్‌ పెరాల శ్రీనివాస్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. ఈ చిట్‌ఫండ్‌లో చిట్టీలు వేసి గడువు ముగిసినప్పటికీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, దాదాపు 10 మంది వరకు బాధితులు ఆయనపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీరికి రూ.కోటి వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement