చెన్నూర్: వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పీసీసీఎఫ్ ఛీఫ్ వినయ్‌కుమార్ అన్నారు. ఆదివారం కోటపల్లి మండలంలోని ప్రా ణహిత వన్యప్రాణుల అభయారణ్యం, శివ్వారం మొసళ్ల కేంద్రాన్ని సందర్శించారు. శివ్వారం మొసళ్ల కేంద్రంలో డ్రోన్ ద్వారా మొసళ్ల సంచారం, లెక్కింపు తెలుసుకున్నారు. శివ్వారం అభయారణ్యం నుంచి పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములు గు జిల్లాలకు వెళ్నిల పులి రూట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కృష్ణజింకల అభయారణ్య పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. మొసళ్ల కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కవ్వాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతారాం, మంచిర్యాల డీఎఫ్‌వో శివ ఆశిష్ సింగ్, చెన్నూర్ ఎఫ్‌డీవో సర్వేశ్వర్, ఫారెస్ట్ అధికారులు చంద్రమౌళి, హఫీజొద్దీన్, సదానందం, తదితరులు పాల్గొన్నారు.


