లక్సెట్టిపేట: కుటుంబానికి యజమాని మహిళే అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లిన తర్వాత అక్కడ ప్రధాన కర్తగా మహిళ ఉంటుందన్నారు. మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడుతూ బాలికల ఆరోగ్యం కోసం ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రవేశపెట్టిందన్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నాలుగోవార్డు, 10వ వార్డులో పర్యటించారు. పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్‌పర్సన్ రాజేశ్వరి, కౌన్సిలర్లు, కమిషనర్ విజయ్‌కుమార్, వైద్యాధికారి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.


